Enter e-mail address submitted with the original post
Write your Comment in English or Transliterated English for Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
Username * :
E-mail * :
Comments
చిమటమ్యూజిక్ వెబ్ సైట్ లో యూజర్స్ కి వారికి ఇష్టమైన పాటల గురించి మనసులోని భావములు ఇతరులకు తెలియజేయు వీలుగా యూజర్ కామెంట్స్ పేజీ ప్రోగ్రాం చేసి, అందులో నేను మొదటగా నాకిష్టమైన పాట గురించి వ్రాయలనుకున్నాను. ఇన్ని వేల పాటలలో ముందుగా ఒక పాటను ఎంచుకోవటం చాలామందికి బహు కష్టమైన సమస్య, నాకు మాత్రం చాలా తేలిక! నాకు తెలుగు పాటల పిచ్చి మొదలైంది షుమారు 36 సం. క్రితం ఈ మధురమైన పాటతోనే. ఇన్ని సంవత్సరములు ఎన్ని వేలసార్లు విన్నా, ఇప్పటికీ మొదటసారి విన్న అనుభూతి కలుగుతుంది. సత్యం స్వరపరచిన ఈ పాట ఎస్.పి బాలసుబ్రమణ్యం గారికి మంచి గుర్తింపు తెచ్చిందని ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. ఈ పాటకి 'అంఖోసే ఉతిరి..' అనే హిందీ పాట ప్రేరణ అంటారు గాని, నాకు మాత్రం రెండు పాటలకి ఎంత విన్నా పోలిక వినపడదు. ఒకవేళ అది నిజమైనా, ఆ పాట నుంచి ఈ అద్బుతమైన పాటని చిలకించగలిగిన సత్యంగారి ప్రతిభ అభినందనీయం!